Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా బిగ్ బాస్ ఫేమ్ ఆలేఖ్య

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (20:06 IST)
Alekhya
తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా బిగ్‌బాస్‌ ఫేం ఆలేఖ్య హారిక నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ ఆమె నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ విషయాన్ని అధికార ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
తెలంగాణకు చెందిన మహిళ, బిగ్‌బాస్‌ ఫేం, దేతడి ఆలేఖ్యను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ బ్రాండ్‌ అంబాసిడర్‌'గా నియమించామని ఉప్పల శ్రీనివాస్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు. 'ఆల్‌ ది వెరీ బెస్ట్‌ హారిక. ఈ పాత్రకు వన్నె తెస్తావని ఆశిస్తున్నానని ఆలేఖ్య హారికను ఉప్పల శ్రీనివాస్‌ అభినందించారు.
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలేఖ్ హారికను తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా నియమించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. బిగ్‌బాస్‌-4 కార్యక్రమంతో అభిమానులను సంపాదించుకున్న ఆలేఖ్య హారిక.. దేతడి అనే యూట్యూబ్ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి దగ్గరైంది.   యూట్యూబ్‌ చానల్‌లో ఆమెకు సుమారు 1.60 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 
 
ఆలేఖ్య తన తెలంగాణ మాండలికాన్ని ఉపయోగించినందుకు సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంది. 23 ఏండ్ల హారిక.. బిగ్‌బాస్-4తో పాటు పలు తెలుగు టీవీ షోలలో కూడా కనిపించింది. ఆలేఖ్య హారికకు ముందు తెలంగాణ పర్యాటక శాఖ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ క్రీడాకారిణి సానియా మీర్జా నియమితులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments