Webdunia - Bharat's app for daily news and videos

Install App

భువనగిరిలో హాట్ కాలింగ్ : బూతు మాటలు మాట్లాడటమే ఉద్యోగం

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో హాట్ కాలింగ్ గుట్టురట్టయింది. ఉద్యోగం పేరుతో అందమైన అమ్మాయిలతో సెక్స్ గురించి బూతు మాటలు మాట్లాడించే ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. తాజాగా వెలు

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (12:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరిలో హాట్ కాలింగ్ గుట్టురట్టయింది. ఉద్యోగం పేరుతో అందమైన అమ్మాయిలతో సెక్స్ గురించి బూతు మాటలు మాట్లాడించే ఇద్దరు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరు జిల్లాకు చెందిన వీరేశం అనే వ్యక్తి భువనగిరి ప్రాంతానికి వచ్చి భవాని అనే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈమె సహాయంతో ఓ కాల్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత మంచి ఉద్యోగంతో పలువురు అమ్మాయిలను ఎంపిక చేసుకున్నాడు. 
 
వీరికి వివిధ రకాలుగా ఆశపెట్టి, కాల్ సెంటర్‌లో కూర్చుని మాట్లాడితే సరిపోతుందని నమ్మబలికి, ఆపై కస్టమర్లతో సెక్స్ సంభాషణలు చేయాలని ఒత్తిడి చేయసాగాడు. దీనిపై నిలదీస్తే తాను సంతకాలు పెట్టిన కాగితాలు చూపించి బెదిరింపులకు దిగుతూ వచ్చాడు. 
 
అయితే, కస్టమర్లతో బూతు మాట్లాడలేని ఓ యువతి ధైర్యం చేసి తనకు ఎదురైన అనుభవంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన గొంతు చాలా బాగుందని, కాల్ సెంటర్‌లో 20 వేల రూపాయలతో ఉద్యోగం ఇస్తామని చెబితే, ఆశపడి ఆ సెంటర్‌కు వెళ్లానని చెప్పింది. ఆపై అక్కడ అప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు అసలు విషయం చెప్పగానే తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పింది.  
 
కస్టమర్లు తమ కాల్‌ను కట్ చేయకుండా ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత బాగా వారిని ఎంటర్‌టెయిన్ చేసినట్టని చెప్పేవారని, జీతంతో పాటు ఇంక్రిమెంట్లు ఇస్తామని ఆశ పెట్టారని బాధితురాలు చెప్పింది. తాను ఇమడలేక, ఆ విషయాన్ని తోటి ఉద్యోగినులకు చెబితే, అందరూ 'లైట్ తీస్కో'మని సలహా ఇచ్చారే తప్ప ఫిర్యాదు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదనీ చెప్పింది. 
 
దీనిపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి కూపీలాగగా అసలు విషయం వెలుగు చూసింది. కాల్ సెంటర్‌పై దాడి చేసిన పోలీసులకు 12 మంది యువతులు ఫోన్ల ముందు కూర్చుని పట్టుబడ్డారు. ఈ కేసులో కాల్ సెంటర్ నిర్వాహకులు వీరేశం, భవానీలను అరెస్ట్ చేశామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం