Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ఫేస్ బుక్ ఫ్రెండ్... 'పద్మావతి'ని చూపిస్తానని థియేటర్లోనే రేప్ చేశాడు...

ఫేస్ బుక్ అడ్డంపెట్టుకుని స్నేహం పేరుతో దగ్గరై మోసం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే వుంది. ఈ మోసాలు రకరకాలుగా వుంటున్నాయి. కొందరు అమ్మాయిలకు ప్రేమ పేరుతో వల వేసి అవసరం తీర్చుకుంటున్న దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సికిందరాబాదులో ఇలాంటి ఘటనే జరిగ

Advertiesment
FB friend
, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (14:31 IST)
ఫేస్ బుక్ అడ్డంపెట్టుకుని స్నేహం పేరుతో దగ్గరై మోసం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతూనే వుంది. ఈ మోసాలు రకరకాలుగా వుంటున్నాయి. కొందరు అమ్మాయిలకు ప్రేమ పేరుతో వల వేసి అవసరం తీర్చుకుంటున్న దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సికిందరాబాదులో ఇలాంటి ఘటనే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్న యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... జనగాం జిల్లా నెర్మెట్ట గ్రామానికి చెందిన 23 ఏళ్ల భిక్షపతి సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. దాని ద్వారా ఎన్నో కబుర్లు చెపుతూ ఆమెను బాగా నమ్మించేశాడు. జగద్గరిగుట్టలో తన సోదరి వుండటంతో అక్కడికి వచ్చినప్పుడల్లా తన ఫేస్ బుక్ స్నేహితురాలిని కలవడం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆమెను హైదరాబాదులోని పలు పార్కుల వెంట కూడా తిప్పాడు. ఈ క్రమంలో డిసెంబరు 29న పద్మావతి చిత్రం చూద్దామంటూ ఆమెను తీసుకుని వెళ్లాడు. 
 
సినిమా థియేటర్లో జనం తక్కువగా వుండటంతో అదే అదనుగా భావించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బంధువులు అతడిపై కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ సొల్లు కామెంట్స్ ... బీజేపీకి మెజార్టీ ఉందన్న పొగరు : టీజీ ఫైర్