ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు దిక్సూచీలా మారిపోయారు. ప్రతి నెలా ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటా.. పార్టీ కేడర్ లోనూ, రాష్ట్ర నాయకత్వంలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా ఖమ్మం పట్టణంలో 33 జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశం ఏర్పాటుతో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వంలో కొత్త ఉత్సాహం పరుగులు వచ్చినట్లు అయింది.
ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ చార్జి మానిక్యం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్, బోస్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సహా పలుపురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.మొదటగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో మాణిక్యం ఠాగూర్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సమావశమయ్యారు.
అనంతరం ఖమ్మం కార్పొరేషన్ బూత్ స్థాయి నాయకులతో వారు సమావేశమ్యారు. ఈ సమావేశానికి దాదాపు 2300 మంది కాంగ్రెస్ బూత్ స్థాయి నాయకులు హాజరవ్వడం విశేషం. అంతేకాక తొలిసారి బూత్ స్థాయి నాయకలకు ఐడీ కార్డులను అందించారు.
ఖమ్మం బూత్ స్థాయి నాయకుల సమావేశంలో సీఎల్నీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీపైనా, స్థానిక మంత్రిపైనా నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. అవినీతి పెరిగిపోయిందని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు.
అంతేకాక ఖమ్మం పట్టణంలోఅహంకారం, అవినీతి హద్దుల్లేకుండా పెరిగిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం, భావ స్వేచ్ఛ అనేవి నగరంలో లేకుండా పోయాయని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. అహంకారానికి, అప్రజాస్వామ్యానికి సమాధానం చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని భట్టి అన్నారు.
ఖమ్మం పట్టణంలోని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేదల కోసం ఇచ్చిన జీ.ఓ. లను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములును రెగ్యులరైజ్ చేసుకున్న స్థానిక మంత్రికి బుద్ది చెప్పాలని భట్టి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు, భావ వ్యక్తీకరణ చేస్తే అక్రమ నిర్భంధాలు చేస్తున్నారని భట్టి అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.
ఖమ్మం నగరంలోని ప్రజలు అనేక భావాలను, ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ ఇస్తారని భట్టి ఈ సందర్భంగా చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న సమయంలోనూ, అన్ని వర్గాలకు, పార్టీలకు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేసుకునే అవకాశాన్ని కల్పించిందని భట్టి ఈ సందర్భంగా వివరించారు.
కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అందుకు పూర్తి విరుద్ధంగా నియంతృత్వ వ్యవస్థలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలకు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని పాలన చేస్తున్న కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రేపు జరిగే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
ఖమ్మం జిల్లాలోనే వ్యవస్థను ఏకీకృతం చేసి ఎన్నికలు పూర్తయ్యే వరకూ ప్రతి డివిజన్, బూత్ లో ఓటర్ మ్యాపింగ్ తో సహా చేసి మనం పని చేయబోతున్నాం. ఇక్కడ వేదికమీదున్న కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి కట్టుగా.. టీఆర్ఎస్ నాయతక్వంపై పోరాటం చేస్తామని భట్టి అన్నారు.
టీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను భయపెట్టినా, బెదిరించినా.. సహించేది లేదని భట్టి హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మొత్తం రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని భట్టి చెప్పారు. మొత్తం కాంగ్రెస్ నాయకత్వం అంతా అండగా ఉంటుందని భట్టి చెప్పారు.
కార్యకర్తల కోసం నాయకత్వం పనిచేస్తుందని భట్టి ఈ సందర్భంగా చెప్పారు. త్వరలో జరగనున్న ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వానికి కానుక ఇవ్వాలని భట్టి పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు.