Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠారెత్తిస్తున్న ఎండలు - పొంగుతున్న బీర్లు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (08:33 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా బీరు అమ్మకాలు పెరిగిపోయాయి. పెరిగిపోతున్న ఉష్ణతాపానికి చిల్డ్ బీరును తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి నిదర్శనమే గత పది రోజుల్లో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారుల వెల్లడించిన వివరాల మేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు బీర్ల అమ్మకాల్లో భారీ పెరుగుదల కనిపించినట్టు తెలిపారు. గత యేడాదితో పోల్చితే ఈ పది రోజుల్లోనే ఏకంగా 20 శాతం మేరకు అమ్మకాలు పెరిగినట్టు చెప్పారు. కేవలం 10 రోజుల్లో 10 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయని తెలిపారు. గత యేడాది ఇదే సమయంలో 8.3 లక్షల బీర్ల అమ్మకాలు పెరిగినట్టు పేర్కొన్నారు. 
 
అదేసమయంలో ఇతర రకాల మద్యం అమ్మ‌కాల్లో స్వల్పంగా తగ్గు‌దల నమో‌దైంది. 2021 ఏప్రిల్‌ మొదటి పది‌ రో‌జుల్లో 6 లక్షల కేసులుగా ఉన్న మద్యం అమ్మ‌కాలు ఈ ఏడాది 13 శాతం తగ్గి 5.14 లక్షల కేసు‌లుగా నమో‌దై‌నట్టు అధి‌కా‌రులు తెలి‌పారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments