బాసర ట్రిపుల్ ఐటీలో మొబైల్‌ ఫోన్ వినియోగంపై నిషేధం

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (18:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గతంలో విద్యార్థులు చేసిన మెరుపు ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెల్సిందే.
 
దాదాపు వారం రోజుల పాటు జరిగిన ఈ ఆందోళనలో అనేకమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆందోళన చేసిన విద్యార్థులు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఇది తీవ్రతరం కావడంతో తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా బాసర క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థులతో చర్చలు జరిపారు. ఆమె ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులు తమ ఆందోళనను విరమించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ క్యాంపస్‍‌లో సెల్‌ఫోన్లు వినియోగించకుండా అధికారులు నిషేధం విధించారు. ట్రిపుల్ ఐటీలోని తరగతి గదులు, అకడమిక్ బ్లాక్, పరిపాలనా భవనాలలో సెల్ ఫోన్లు వినియోగించరాదంటూ ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ ఆదేశాలు జారీచేశారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
 
మరోవైపు, మొబైల్ ఫోన్లు వినియోగించకుండా నిషేధం విధించడంపై విద్యార్థులు భగ్గుమన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని, డిమాండ్లన అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టూడెంట్స్ గవర్నెన్స్ కౌన్సిల్ మండిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

తర్వాతి కథనం
Show comments