ఏటీఎంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు... పోటెత్తిన జనం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (18:17 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో ఓ ఏటీఎం కేంద్రంలో రూ.1000 డ్రా చేస్తే రూ.2000 నగదు వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. దీంతో స్థానికులు ఈ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డ్రా చేసేందుకు ఎగబడ్డారు. ఏటీఎం సెంటరు వద్ద భారీ క్యూ చేరిపోయింది. ఈ ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందినది. ఈ విషయం తెలిసిన వెంటనే అగమేఘాలపై అక్కడకు చేరుకున్న బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటరును మూసివేశారు. 
 
బ్యాంకు ఆఫ్ బరోడాకు చెందిన ఏటీఎం కేంద్రంలో రూ.వెయ్యి డ్రా చేస్తే రూ.2 వేల నగదు వస్తుందన్న వార్త ఆ ప్రాంతమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో ఏ ఏటీఎం వద్దకు ప్రజలు భారీగా తరలివచ్చారు. డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు బయటకు వస్తుందన్న నేపథ్యంలో బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. 
 
ఆ వెంటనే స్పందించిన అధికారులు ఆ ఏటీఎంను మూసివేశారు. సాంకేతిక సమస్య కారణంగానే ఆ ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు. దీంతో ఏటీఎంను మూసివేసి తనిఖీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Alia Bhatt : ఆలియా భ‌ట్‌కు అండ‌గా శ‌ర్వారి పాత్రతో ఆల్ఫా ట్రైల‌ర్‌

Raashi Singh: సినిమాలు, వ్యాపారాలే కాకుండా ఇంకా చాలా చేయాల్సి ఉంది : రాశీ సింగ్

Samantha diet: నేను పెద్దగా తినలేను అందుకే బరువు తగ్గాను : సమంత ప్రభు

విజయ్‌ విజయం.. అకస్మాత్తుగా రాలేదు : సమంత

Divija: ప్రభాకర్ కుమార్తె దివిజ హీరోయిన్‌గా వెంకట్రామయ్య గారి తాలూకా

తర్వాతి కథనం
Show comments