Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. స్కూల్‌లోనే ఐసోలేషన్‌

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (13:27 IST)
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాఠశాలల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అనేక మంది విద్యార్థులు, టీచర్స్ కరోనా బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం కూడా తరగతుల నిర్వహణపై పునరాలో చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పారు. పాఠశాలల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తాజాగా హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్‌ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. బుధవారం నాగోల్‌లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 38 విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు భయాందోళనకు గురతున్నారు. అప్రమత్తమైన అధికారులు కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 184 మంది విద్యార్ధినులకు పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.
 
మిగితావారికి అధికారులు ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. అయితే కరోనా సోకిన 38 విద్యార్ధులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన విద్యార్ధులను ఇళ్లకు పంపేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన వారికి స్కూల్‌లోనే ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments