ఢిల్లీ మద్యం స్కామ్ : అరబిందో ఫార్మా డైరెక్టర్ అరెస్టు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (10:20 IST)
ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం స్కామ్‌లో అరబిందో ఫార్మా డైరెక్టరుతో పాటు మరో వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది. ఈ కేసు విచారణను వేగవంతం చేసిన ఈడీ... అరబిందో ఫార్మా డైరెక్టరుగా ఉన్న శరత్‌శ్చంద్రా రెడ్డి, వినయ్ బాబులను అదుపులోకి తీసుంది. వీరివద్ద వరుసగా మూడు రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేసినట్టు ప్రకటించింది. వీరిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే, శరత్‌శ్చంద్రా రెడ్డి అరబిందో ఫార్మాలో 12వ డైరెక్టరుగా ఉండటం గమనార్హం. 
 
ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. వీరిద్దరి వద్ద గత మూడు రోజులుగా విచారణ జరుపుతోంద. విచారణ ముగిసిన వెంటనే అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు, ఈ అరెస్టులపై ఈడీ స్పందిస్తూ, వీరిద్దరికీ కోట్లాది రూపాయల వెలువైన మద్యం వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. 
 
ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్టు శరత్‌శ్చంద్రారెడ్డిపై అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. ఈడీ తాజా అరెస్టులు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. మున్ముందు ఇంకెన్ని, ఇంకెంత మంది అరెస్టు అవుతారో అనే చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments