Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో నా కొడుకు చనిపోయినప్పుడు సూసైడ్ చేసుకుందామనుకున్నా... బాబూ మోహన్

తమ పిల్లలు కాలు కింద పెట్టకూడదనీ, దర్జాగా మహరాజులా బతకాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే వారు ఏది అడిగితే అది కాదనకుండా, వారి శక్తిమేరకు అన్నీ సమకూరుస్తున్నారు. ఇలాంటి వాటిలోనే కార్లు, రేసింగ్

Webdunia
బుధవారం, 10 మే 2017 (19:54 IST)
తమ పిల్లలు కాలు కింద పెట్టకూడదనీ, దర్జాగా మహరాజులా బతకాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే వారు ఏది అడిగితే అది కాదనకుండా, వారి శక్తిమేరకు అన్నీ సమకూరుస్తున్నారు. ఇలాంటి వాటిలోనే కార్లు, రేసింగ్ బైకులు కూడా వుంటున్నాయి. ఇలాంటి వాహనాలతోనే కొందరు పిల్లలు తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 
 
గతంలో కోట శ్రీనివాస రావు కుమారుడు, హాస్య నటుడు, ఎమ్మెల్యే బాబూ మోహన్ కుమారుడు ఇలా అతివేగంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మంత్రి నారాయణ కుమారుడు కూడా అత్యంత వేగంతో కారును నడిపి ప్రాణాలు కోల్పోయారు. తండ్రి బిడ్డను కోల్పోతే అనుభవించే నరకం ఎలాంటిదో బాబూ మోహన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
 
తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాననీ, ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడిననీ, ఆ సమయంలో ఈవీవి సత్యనారాయణ తన మనసు మార్చి ఓదార్చారన్నారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఎవడిగోల వాడిది చిత్రం కోసం అక్కడికి తీసుకెళ్లి తనకు మనశ్శాంతి కల్గించాడనీ, ఆ రోజు ఇవివి సత్యనారాయణ అలా చేయకపోతే తను వుండేవాడిని కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments