Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది: రేవంత్ రెడ్డి

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (06:48 IST)
రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించదని తెలిపారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. సీఎం మాటల్లో అడుగడుగునా అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించిందని మండిపడ్డారు.

16 మంది కార్మికులు చనిపోతే.. మానవత్వం లేకుండా మాట్లాడి మృతుల కుటుంబాలను అవమానించారని విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం చెప్పే ప్రయత్నంకాని, సమస్య పరిష్కరించే చిత్తశుద్ధికాని కనిపించలేదని స్పష్టం చేశారు.

రాచరికం రోజుల్లో కూడా ఇంతటి నియంతను ప్రజలు చూసి ఉండరని రేవంత్​ పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి అహంకారిని తెలంగాణ సమాజం ఎక్కువ కాలం భరించలేదని అన్నారు.

ఇప్పటికే హద్దుదాటి ముఖ్యమంత్రి దుర్మార్గాన్ని సమాజం భరించిందని... ఇక ఒక్క క్షణం కూడా కేసీఆర్‌ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో ఉద్యమం తీవ్ర రూపంలో మొదలు కావాల్సిన సమయం వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments