Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను బీరు సీసాతో పొడిచి.. గొడ్డలితో నరికి... బిడ్డను నీటి సంపులో పడేసిన భర్త

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (10:25 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అనాజ్‌పూర్‌లో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. బీరుసీసాతో ముఖంపై కొట్టి, గొడ్డలితో నరకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అలాగే, మంచంమీదున్న నెలన్నర బిడ్డను నీటి సంపులో పడేశాడు. అప్పటికీ కోపం చల్లారక పోవడంతో రెండున్నరేళ్ల కుమార్తెను కూడా చంపేందుకు ప్రయత్నించాడు. అయితే, తండ్రి ప్రవర్తన చూసి భయంతో ఇంటి నుంచి పరుగు తీసి పక్క ఇంటిలోకి వెళ్లడంతో ఆ చిన్నారి ప్రాణాలు దక్కించుంది. ఆ తర్వాత తన తండ్రి చేసిన ఘాతుకాన్ని కళ్లకు కట్టినట్టు ఇరుగు పొరుగువారికి చెప్పింది. వారు వచ్చేలోపు ఆ కసాయి భర్త బైకుపై పారిపోయాడు. ఈ దారుణం బుధవారం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనాజ్‌పూర్‌కు చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌కు అదే మండలంలోని బండిరావిరాలకు చెందిన లావణ్య (23)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల ఆద్య అనే కుమార్తె ఉండగా, ఫిబ్రవరి 3వ తేదీన కుమారుడు జన్మించాడు. ధన్‌రాజ్ తల్లి మృతి చెందడంతో తన తండ్రి బాలయ్యతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే లావణ్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. బుధవారం భార్యకు ఫోన్ చేసి తాను బండిరావిరాలకు వస్తున్నానని, బాబుకు నెవరారీ ఇంజెక్షన్ వేయించాల్సి వుందని చెప్పి, 11 గంటలకు అత్తవారింటికి వెళ్లి భార్యతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు అనాజ్‌పూర్‌కు చేరుకున్నాడు. 
 
అక్కడ ఏమైందో ఏమోగానీ అనూహ్యంగా భార్యపై ధన్‌రాజ్ విరుచుకుపడి హత్య చేశాడు. ఈ దారుణమంతా చూసిన రెండున్నరేళ్ల కుమార్తె ఆద్య హడలిపోయి ఏడుస్తూ అక్కడ నుంచి బయటకు వచ్చేసింది. ఆమెను పక్కింటి బాలిక ఎత్తుకుని తమ ఇంట్లోకి తీసుకెళ్లింది. పట్టలేని ఆవేశంతో ఉన్న ధన్‌రాజ్‌ కుమార్తెను కూడా హతమార్చేందుకు ఇళ్లంతా గాలించినా ఆ చిన్నారి కనిపించలేదు. 
 
చివరకు రక్తపు మరకలో ఉన్న ధన్‌రాజ్‌ను ఇరుగుపొరుగువారుచూసి ప్రశ్నించగా, ఏమీలేదని చెప్పి హెల్మెట్ పెట్టుకుని బైకుపై పారిపోయాడు. పక్కింటివారు ఇంట్లోకి వెళ్లి చూడగా లావణ్య విగతజీవిగా పడివుంది. నీటిసంపులో పడివున్న నెలన్నర పసికందును వారు బయటకు తీసినప్పటికీ ఆ చిన్నారి అప్పటికే చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments