Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... జగిత్యాల అదనపు కలెక్టర్‌గా జీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్‌గా జి. పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్‌గా ఖీమా నాయక్ కు పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా ఐపీఎస్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ హోదా, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడం, వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తోంది.  
 
ఈ నేపథ్యంలో వరంగల్ అదనపు కలెక్టర్ గా కె. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వై.వి. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్‌గా ఎం. డేవిడ్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 
 
ఇప్పటివరకు నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా ఉన్న పీ.శ్రీనివాస్ రెడ్డిని సిద్ధిపేటకు బదిలీ చేశారు. అంతేకాకుండా... బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ ను కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. 
 
ఛంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్ కుమార్ తో పాటు హైదరాబాద్ జిల్లా భూ పరిరక్షణ ఎన్డీసీగా జీ. సంతోషినిలను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలువురు నాన్ కేడర్ అధికారులను కూడా బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments