Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్క మొగుడితో అక్రమ సంబంధం.. బావతో భర్తను చంపేందుకు కుట్ర...

బావతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని పెళ్లయిన ఆరు నెలలకే భర్తను కడతేర్చాలని చూసింది ఓ ఇల్లాలు. తన అక్క భర్తతో కలిసి తాను కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు పథకం వేసి పోలీసులకు చెక్కింది. యాదాద్రి జిల్లా లనుపాక గ్రామానికి చెందిన ఎంబరి పోషయ్య పెద్

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (21:35 IST)
బావతో తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని పెళ్లయిన ఆరు నెలలకే భర్తను కడతేర్చాలని చూసింది ఓ ఇల్లాలు. తన అక్క భర్తతో కలిసి తాను కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు పథకం వేసి పోలీసులకు చెక్కింది. యాదాద్రి జిల్లా లనుపాక గ్రామానికి చెందిన ఎంబరి పోషయ్య పెద్ద కూతురు గాయత్రికి విజయవాడకు చెందిన పత్తి శ్రీనుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. దీంతో పోషయ్య చిన్నకూతురు అయిన జ్యోతి అప్పుడప్పుడు విజయవాడలోని అక్క ఇంటికి వెళ్లేది.
 
ఈ క్రమంలో తన బావ శ్రీనుతో ఆమెకు శారీరక సంబంధం ఏర్పడింది. ఆరు నెలల క్రితం జ్యోతికి రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లికి చెందిన గాజుల రాజుతో వివాహమైంది. అయినప్పటికీ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీతో ఉంటానని జ్యోతి తన బావతో చెప్పేది. జ్యోతి తరచూ బావ శ్రీనుతో ఫోన్‌లో మాట్లాడేది. రాజుతో ఇంకా ఎన్నాళ్లు కాపురం చేయాలి, ఆయన్ని చంపు అని ఫోన్‌లో మాట్లాడింది. 
 
జ్యోతి కోరికపై రాజును ఎలాగైనా చంపాలని శ్రీను ప్లాన్‌ వేశాడు. ఈ నెల 3వ తేదీన పొలాల వద్ద రాజు గొర్రెలను మేపుతుండగా శ్రీను, మరొకరు నిందితుడు వెంకటదుర్గారావు, ఇద్దరూ రాజు ముఖంపై యాసిడ్‌ పోసి గొంతు నులిమి చంపేందుకు యత్నిస్తుండగా సమీపంలో ఉన్న గొర్రెల కాపరులు గుర్తించి కేకలు వేయడంతో పారిపోయారు. 
 
ఈ ఘటనలో గాయపడిన రాజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. పోలీసులకు అనుమానం వచ్చి జ్యోతిని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. జ్యోతి సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీల ఆధారంగా నిందితులను సులభంగా గుర్తించారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments