అమరావతి: మూడో రోజూ అన్ని పరీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మూడో రోజు టెట్ ముగిసింది. మొత్తం 47,276 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారని టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారె
అమరావతి: మూడో రోజూ అన్ని పరీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మూడో రోజు టెట్ ముగిసింది. మొత్తం 47,276 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారని టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పేపర్ 1 ఎస్టీటీ తెలుగుకి సంబంధించి పరీక్ష నిర్వహించామని, ఈ పరీక్షకు 49380 మంది దరఖాస్తు చేయగా 47,276 అభ్యర్థులు హాజరయ్యాయరని అన్నారు.
మూడో రోజు మొత్తం 95.74 శాతం మంది టెట్‌కు హాజరయ్యారని చెప్పారు. మొత్తం 99 సెంటర్లలో పరీక్ష నిర్వహించామన్నారు. టెట్ పరీక్ష ముగిసిన వెంటనే బటన్ నొక్కగానే అభ్యర్థులకు తమతమ మార్కులు స్క్రీన్ పైన కనిపించాయి. ఈ మార్కుల వివరాలను అభ్యర్థుల మొబైళ్లకు బుధవారం పంపిస్తామని టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు.
టెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు తప్పనిసరిగా క్రీడల్లో తాము సాధించిన ప్రతిభా పత్రాలను టెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి వుంటుందని, వీటికి సంబంధించి అనుబంధ ఫార్మాట్‌లు వెబ్‌సైట్‌లో వుంచామని టెట్ కన్వీనర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. అనుబంధ పత్రం 1, 2, 3 లుగా వుంచామని ఒక్కోటో పత్రానికి 30 ఇన్సెంటివ్ మార్కులు, రెండో ఫార్మాట్‌కు 25, మూడో ఫార్మాట్‌కు 20 మార్కులు వుంటాయన్నారు. వీటిని సంబంధిత ఫెడరేషన్లు, యూనివర్శటీలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లు వద్ద ధృవీకరణ చేయించుకొని అప్‌లోడ్ చేయాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.