Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిపై మోజు, భర్తను అత్యంత దారుణంగా చంపించిన భార్య

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (21:13 IST)
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబంతో ఎంతో సంతోషంగా బ్రతకవలసినవారు ఈ అక్రమ సంబంధాల కారణంగా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఇల్లాలు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రంలోని చైత్యనపురి కాలనీలో జరిగింది. నల్గొండ, చైతన్యపురి కాలనీకి చెందిన సోమ కేశవులు అనే రియల్టర్ ఉండగా, ఈయనకు భార్య స్వాతి ఉన్నారు. ఈమెకు అదే ప్రాంతానికి ప్రదీప్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం మూడేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ విషయం భర్తకు తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి
 
భర్త భార్యను వేధించం మొదలుపెట్టాడు. తరచుగా ఫోన్‌లో మాట్లాడడం, వాట్సప్‌లో ఫొటోలు ఉండటంతో ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు జరిగాయి. దీంతో స్వాతి తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. 2 లక్షలు ఇస్తానని స్వాతి ప్రియుడికి చెప్పింది. దీంతో ప్రియుడు ప్రదీప్‌ సోమ కేశవులును హత్య చేసేందుకు బొట్టుగూడలో ప్రింటర్‌గా పనిచేస్తున్న కొడిదేటి శివకుమార్‌ను సంప్రదించాడు. స్వాతితో తనకున్న సంబంధాన్ని వివరించాడు. స్వాతి భర్త అడ్డు తొలగించాలని చెప్పడంతో హత్యకు ప్లాన్‌ వేశారు.
 
వీరిద్దరితో పాటు వెంకపల్లి గ్రామానికి చెందిన కంబం ప్రసాద్, బొట్టుగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ చింతపల్లి నగేశ్, ప్రదీప్‌ అందరూ కలిసి హత్య చేశారు. మద్యంలో మత్తు కలిపి ఇవ్వడంతో కేశవులు అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. ఆ తర్వాత అందరూ కలిసి హత్య చేశారు. అతడి గొంతు పిసికి, తలపై బండరాయితో మోదటంతో ఆ దెబ్బలను తాళలేక కేశవులు ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. హత్య కేసులోని మిస్టరీని ఛేదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments