Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతని రూమ్‌కు వెళ్లి మూడు రాత్రులు గడిపింది... నిజం చెప్పేశాడు... ఆ తరువాత?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (18:49 IST)
ప్రియుడే సర్వస్వమని నమ్మింది. అన్నీ అర్పించింది. చివరకు ప్రియుడికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకుని షాకయ్యింది. హైదరాబాదులో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్ లోని ఒక లేడీస్ హాస్టల్‌లో హెబ్సికారాణి, ప్రత్యూషలు ఉంటున్నారు. ఇద్దరూ ఎంబిబిఎస్ చదువుతున్నారు. హెబ్సికారాణి తల్లి, దండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఫాస్టర్ బెన్ హాం హెబ్సికారాణికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. ఆయన హెబ్సికాను తన కుమార్తెలా భావించేవాడు. ఎంబిబిఎస్ చదువుతున్న హెబ్సికా, ప్రత్యూషలు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రత్యూష నగేష్‌ను ప్రేమించగా, హెబ్సికా రాణి ఆంజనేయులు ప్రేమించింది. నగేష్‌‌తో ప్రత్యూష కమిటైంది. పెళ్ళి చేసుకుందామని నగేష్‌ చెప్పడంతో అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. 
 
నగేష్‌‌తో తాను చనువుగా ఉన్న క్షణాలను ప్రత్యూష తన స్నేహితురాలు హెబ్సికారాణికి  చెప్పింది. దీంతో హెబ్సికా కూడా తన ప్రియుడితో కలవడం మొదలుపెట్టింది. అతని రూమ్‌కు వెళ్లి మూడు రాత్రులు గడిపింది. ఆ తరువాత మెల్లగా హెబ్సికాతో మాట్లాడటం మానేశాడు ఆంజనేయులు. పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది హెబ్సికా. అది సాధ్యం కాదంటూ కువైట్‌కు వెళ్ళిపోయాడు. అయినాసరే ఫోన్లలో మాట్లాడుతూ ఉండేది. ఈరోజు, రేపు అంటూ నాన్చుతూ వచ్చిన ఆంజనేయులు ఒకరోజు సడెన్‌గా హైదరాబాద్‌కు వచ్చాడు. దీంతో హెబ్సికా అతన్ని కలిసింది.
 
ఈసారి ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలంది. దీంతో ఆంజనేయులు అసలు విషయం చెప్పేశాడు. తనకు ఆరు సంవత్సరాల క్రితమే వివాహమైందని, తనభార్య, పిల్లలిద్దరూ కరీంనగర్‌లో ఉంటారని చెప్పాడు. దీంతో హెబ్సికా షాకయ్యింది. ప్రియుడు తనను మోసం చేశాడని తెలుసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు ఆంజనేయులు పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments