Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి అడ్డు వస్తున్నాడని భర్తను సజీవ దహనం చేసిన భార్య

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (18:07 IST)
ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాల్చేసింది ఓ భార్య. ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా కనుగొన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో గత నెల 26న ఎస్‌కేడీ నగర్‌లో అర్థరాత్రి గుడిసెలో ఉంటున్న ఓ వ్యక్తి సజీవదహనమైనట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు, గుడిసెలో ఓ వ్యక్తి దహనమైనట్లు కనుగొన్నారు. తొలుత ఇది అగ్ని ప్రమాదం అని భావించారు. 
 
కానీ ఆ తర్వాత పరిసర ప్రాంతంలో ఫిక్స్ చేసిన సీసీ కెమేరా చూసేసరికి ఎవరో గుడిసెకు నిప్పు పెట్టినట్లు రికార్డయ్యింది. అలా నిప్పుపెట్టింది ఓ మహిళగా వారు గుర్తించారు. దీనితో తమదైన శైలిలో మృతుడి భార్య వద్ద విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.
 
మృతుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. తన ప్రియుడికి అడ్డు వస్తున్నాడన్న ఆగ్రహంతో భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అర్థరాత్రి భర్త నిద్రపోతున్నవేళ ప్రియుడితో కలిసి పూరింటికి నిప్పు పెట్టేసింది. దీనితో ఆమె భర్త సజీవ దహనమయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments