Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా రూంలో యువతికి గాలం... మొదటిరోజే హద్దులు దాటారు...

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (20:00 IST)
హైదరాబాద్ లోని దిల్‌షుక్ నగర్ ప్రాంతమది. తెల్లవారు జామున 6 గంటల సమయం. ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ జరుగుతుండగా రూప అనే యువతి పేరు బయటపడింది. 
 
మృతి చెందిన రాజశేఖర్, రూపలు ఇద్దరూ ప్రేమికులు. రాజశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. సొంత జిల్లా నల్గొండ జిల్లా చౌటుపల్లి. రియల్ ఎస్టేట్ కోసం హైదరాబాదుకు వచ్చి వెళ్ళేవాడు. రూప దిల్‌షుక్ నగర్లో గదిని అద్దెకు తీసుకుని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. రూపకు దగ్గరలోనే రాజశేఖర్ స్నేహితుడి గది ఉండేది. రియల్ ఎస్టేట్ పని మీద వచ్చే రాజశేఖర్ అప్పుడప్పుడు స్నేహితుడి గదిలో పడుకునేవాడు. 
 
రాజశేఖర్, రూపలకు అక్కడే పరిచయం ఏర్పడింది. ఒక్కరోజు పరిచయం చివరకు శారీరక సంబంధానికి దారి తీసింది. అది కాస్తా ఆరు నెలల వరకు సాగింది. ఒకరోజు రాజశేఖర్ రూప గదికి వచ్చాడు. శేఖర్ ముభావంగా కనిపించాడు. ఏం జరిగిందని అడిగింది రూప. రాజశేఖర్ నిజాన్ని చెప్పాడు. తనకు ఇదివరకే పెళ్ళయ్యిందని.. భార్య నల్గొండ జిల్లాలో ఉంటుందని చెప్పాడు.
 
దీంతో రూప షాకయ్యింది. కానీ రాజశేఖర్ మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. నన్ను నమ్ము.. నిన్ను కూడా పెళ్ళి చేసుకుంటానన్నాడు. లేకుంటే చనిపోతానన్నాడు. దీంతో రూపకు అతనిపై నమ్మకం ఏర్పడింది. మరో నెలపాటు వీరి మధ్య స్నేహం కొనసాగింది.

ఇదిలావుండగా ఒకరోజు అకస్మాత్తుగా రాజశేఖర్‌ను చంపేశానని రూప తమ్ముడు ప్రసాద్ ఆవేశంగా తన గదికి వచ్చి చెప్పాడు. దీంతో రూప ఆందోళనకు గురైంది. ఎందుకు చంపేశావని ప్రశ్నించింది. ఇదివరకే రాజశేఖర్‌కు పెళ్ళయ్యింది. నిన్ను మోసం చేస్తున్నాడు అక్కా అన్నాడు తమ్ముడు. దీంతో రూప కుప్పకూలిపోయింది. తనతో ఆ విషయం శేఖర్ చెప్పాడనీ, అందుకు అంగీకరించే ఇద్దరం వుంటున్నామంటూ బోరుమని విలపించింది. పోలీసులు రూప తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments