Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలకు విషమిచ్చిన తల్లి

Webdunia
శనివారం, 23 మే 2020 (15:26 IST)
శామీర్ పేట్ మండలం మజీత్ పూర్ ప్రజా హోమ్స్‌లో గత రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలకు పురుగుల మందు యిచ్చి  తను ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రీతి సూరారం మల్లారెడ్డి హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ రాత్రి తుది శ్వాస విడిసింది.
 
మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య చెలరేగిన వివాదాలు ఇద్దరు చిన్నారులను  బలికొన్న ఘటన మేడ్చల్ జిల్లా షామీర్ పేట పోలీస్ స్టేషన పరిధిలో చోటు చేరుకుంది.
 
గోపీనాథ్ ప్రీతి అనే దంపతులు షామీర్ పేట లోని మజీద్ పూర్‌లో గత కొంత కాలంగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రీతి తల్లితండ్రులు తన చిన్నతనంలోనే మృతి చెందడంతో తాను వరంగల్‌లోని ఒక అనాధ ఆశ్రమంలో పెరిగింది. తాను పెరిగి పెద్దయిన తర్వాత గోపీనాథ్ అనే యువకుడు ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె తరచు తాను పెరిగిన అనాధ ఆశ్రమానికి వెళ్ళేది.
 
భార్యాభర్తల మధ్య తరచు గొడవ రావడంతో ప్రీతి తీవ్రంగా మనస్తాపానికి గురైంది. కాగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో తరచు గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో గోపీనాథ్ భార్య ప్రీతి తీవ్ర మనస్తాపానికి గురై తన కుమారులైన గౌరవ 4, కౌశిక్ 3 ఇద్దరికి విషం ఇచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడింది. దీనితో తల్లీబిడ్డలకు చికిత్సా నిమిత్తం మేడ్చల్ లోని లీలా హాస్పిటల్ లో చేర్చారు. చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందగా తల్లి ప్రీతి పరిస్థితి విషమంగా ఉంది. చివరికి ఆమె కూడా హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments