పెళ్ళయి ఆరు నెలలే... కోడి పులుసులో భర్తకు విషం పెట్టేసింది

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (18:20 IST)
అన్యోన్యంగా సంసారం మొదలుపెట్టారు భార్యాభర్తలు. ఆనందానికి కేరాఫ్ అడ్రస్ అనుకునే విధంగా కనిపించారు. చుట్టుప్రక్కల వారికి భార్యాభర్తలంటే వీరే అని చెప్పుకునే విధంగా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి వారి కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. పండంటి సంసారం కాస్తా కుప్పకూలిపోయింది. ఇంతకీ ఏం జరిగింది?
 
హైదరాబాద్ హిమాయత్ నగర్ అది. రాజేష్, సారికలు భార్యాభర్తలు. వీరికి పెళ్ళై ఆరునెలలు అవుతోంది. రాజేష్‌ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సారిక ఒక పెళ్ళి పందిరి కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. ఇద్దరికీ ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. ప్రశాంతమైన జీవితం. కొత్తగా పెళ్ళవ్వడంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. వారం మొత్తం కష్టపడినా ఒక్క ఆదివారం మాత్రం బాగా ఎంజాయ్ చేసేవారు. 
 
భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండేవి కావు. అయితే ఉన్నట్లుండి సారిక భర్తను దూరం పెడుతూ వచ్చింది. అది కూడా నెలరోజుల నుంచే. అందుకు కారణం వివాహేతర సంబంధం. పెళ్ళి పందిరి కంపెనీలో తనతో పాటు పనిచేసే సూర్యనారాయణతో సారిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఎక్కువ వర్క్ ఉందంటూ భర్తకు ఏదో ఒకటి చెప్పి రాత్రి 9 గంటల తరువాత ఇంటికి వెళ్ళేది. భర్తను దూరంగా పెట్టేది.
 
సారిక వ్యవహారంపై అనుమానం వచ్చిన రాజేష్ విషయంపై దృష్టి సారించాడు. దాంతో సారిక మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకుని కుంగిపోయాడు. భార్యను ఏమీ అనలేక మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు ఇంటికి మద్యం తాగి వచ్చేవాడు. అయితే తన అక్రమ సంబంధం కొనసాగించాలంటే భర్తను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది సారిక. 
 
భర్తకు ఇష్టమైన చికెన్ పులుసు ఇంట్లో చేసింది. ఆ పులుసులో విషాన్ని కలిపింది. అది తెలియని రాజేష్ తినేశాడు. కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయాడు. తన భర్త చనిపోయాడన్న రాజేష్ తమ్ముడు నరేష్‌కు చెప్పింది సారిక. సారికపై అనుమానం వచ్చిన నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అన్నీ బయటపడ్డాయి. దీంతో సారికతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments