Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి గోవా టూర్ కోసం దొంగతనం చేయాలనుకుని హత్య చేశాడు.. ఆ తరువాత?

ప్రియురాలిని గాఢంగా ప్రేమించాడు. ప్రియురాలు అడిగిందంతా కొనిచ్చాడు. డబ్బులు లేకపోయినా అప్పులు చేయడం ప్రారంభించాడు. చివరకు అప్పులు మిగిలిపోయాయి తప్ప ప్రియురాలి కోర్కెలు మాత్రం ఆగలేదు. గోవాకు వారం రోజుల పాటు తీసుకెళ్ళాలని ప్రియురాలు ఒత్తిడి తెచ్చింది. క

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (14:37 IST)
ప్రియురాలిని గాఢంగా ప్రేమించాడు. ప్రియురాలు అడిగిందంతా కొనిచ్చాడు. డబ్బులు లేకపోయినా అప్పులు చేయడం ప్రారంభించాడు. చివరకు అప్పులు మిగిలిపోయాయి తప్ప ప్రియురాలి కోర్కెలు మాత్రం ఆగలేదు. గోవాకు వారం రోజుల పాటు తీసుకెళ్ళాలని ప్రియురాలు ఒత్తిడి తెచ్చింది. కానీ చేతిలో డబ్బులు లేవు. డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక దొంగతనం చేయాలనుకున్నాడు. దొంగతనానికి వెళ్ళి చివరకు హత్య చేయాల్సి వచ్చింది. 
 
హైదరాబాద్ శివారు ప్రాంతమైన రామాంత్‌పూర్‌లో నివాసముంటున్న వెంకట్, తులసిలు 3 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వెంకట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. భూములను బాగా అమ్మి లక్షల రూపాయలు ఆర్జించాడు. భార్య తులసిపై ప్రేమతో ఆమెకు ఎన్నో నగలను చేయించాడు. అదే ప్రాంతానికి చెందిన రంజిత్ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతున్నాడు. 6 నెలలుగా జ్యోతి అనే యువతిని ప్రేమించాడు. ప్రేయసి అడిగిన చోటికి తీసుకెళ్ళి.. డబ్బులు బాగా ఖర్చు పెట్టాడు. అప్పులు చేశాడు. 
 
ప్రేయసి ఉన్నట్లుండి గోవాకు తీసుకెళ్ళమని ఒత్తిడి తెచ్చింది. చేతిలో డబ్బులు లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు దొంగతనం చేయాలనుకున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట్ ఇంట్లో దొంగతనం చేయాలనుకున్నాడు. పక్కా ప్లాన్ వేశాడు. మూడురోజులు రెక్కీ నిర్వహించాడు. వెంకట్ ఇంట్లో లేని సమయంలో లోపలికి వెళ్ళాడు. ఇల్లు అద్దెకు కావాలని వెంకట్ భార్య తులసితో మాట్లాడారు. ఆమె ఇల్లు చూపిస్తుండగానే ఆమెకు కత్తి చూపించి బెదిరించాడు. 
 
తులసి గట్టిగా అరవడంతో మెడపై గట్టిగా చేత్తో నొక్కి ఊపిరాడకుండా చేశాడు. దీనితో ఆమె చనిపోయింది. ఆ తరువాత బీరువాలోని డబ్బులు, తులసి ఒంటిపై ఉన్న నగలను తీసుకెళ్ళిపోయాడు. హత్య జరిగిన విషయాన్ని పనిమనిషి ద్వారా గుర్తించిన తులసి భర్త పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్య ఎవరు చేశారా అన్న విషయంపై ఆరా తీశారు. కానీ గుర్తించలేకపోయారు. వారంరోజుల తరువాత హత్య జరిగిన ఇంటి మిద్దెపై ఒక ఎటిఎం స్లిప్‌ను కనిపెట్టారు. ఆ స్లిప్ ఆధారంగా శ్యామ్ అనే వ్యక్తిని విచారించారు. హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు శ్యామ్.
 
ఎటిఎం స్లిప్ ఆధారంతో సిసి టివి ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఒక యువకుడు ఉన్నాడు. వెంటనే తులసి ఉన్న ప్రాంతంలో యువకుడి కోసం గాలించారు. దీంతో రంజిత్ బాగోతం బయటపడింది. ప్రేయసి ముందే ప్రియుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు పోలీసులు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments