Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రాత్రి భార్యను వదిలి పరారైన భర్త.. ఎందుకు?

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (14:31 IST)
శోభనం రాత్రి భార్యను వదిలి భర్త ఎందుకు పరారవుతాడు.. ఇదెక్కడో విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా. నిజమేనండి. ప్రేమించాడు. యువతిని నమ్మించి సహజీవనం చేశాడు. చివరకు పెళ్ళి ఊసెత్తేసరికి తప్పించుకుతిరిగాడు. పోలీసుల సాయంతో యువతి పెళ్ళి చేసుకుంటే చివరకు ఆమెను పెళ్లి చేసుకుని శోభనం రోజు రాత్రి ఇంటి నుంచి పరారయ్యాడు.
 
బంజారాహిల్స్ లోని ఎన్‌బీటీ నగర్‌లో నివశించే ఒక యువతి, విశాఖ జిల్లాకు చెందిన రమణగౌతమ్‌లకు గత ఆరేళ్ళకు ముందు పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో సినిమా అవకాశాల కోసం వచ్చిన యువతిని రమణ గౌతమ్ మాయమాటలు చెప్పి స్నేహం చేశాడు. సినిమాల్లో ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి ఆమెను ఆ ఫీల్డ్ నుంచి తప్పించాడు. దీంతో యువతి తన సోదరుడితో కలిసి గల్ప్‌కు వెళ్ళింది. రెండేళ్ల పాటు అక్కడే కష్టపడి పనిచేసి తన ప్రియుడికి డబ్బులు పంపేది.
 
అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. ఆరు నెలల పాటు ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. మళ్ళీ సింగపూర్‌కు వెళ్ళి పనులు  చేసింది యువతి. 5 లక్షల దాకా సంపాదించి గత నెల మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చింది. సంపాదించిన డబ్బు మొత్తాన్ని గౌతమ్‌కు ఇచ్చేసింది. డబ్బు మొత్తం తీసుకున్న గౌతమ్ ఇక ఆమెతో పనిలేదని నిర్ణయించుకున్నట్లున్నాడు. వెళ్ళిపోదామనుకునేసరికి యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది.
 
అందుకు అతడు ఒప్పుకోలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు దగ్గరుండి పెళ్ళి చేశారు. శోభనం ఇక మిగిలింది. ఆ సమయంలో ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన ప్రియుడు మళ్ళీ రాలేదు. గత రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ లేదు. దీంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments