Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉస్మానియాలో భారీ సభ, మైకులను పీక్కుపోయిన పోలీసులు

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (15:52 IST)
ఆర్టీసి కార్మికులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించేందుకు యూనివర్శిటీ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరాం, చాడ, తమ్మినేని, వివేక్ వెంకటస్వామి, పోటు రంగారావు తదితరులు హాజరు కానున్నారు.
 
ఇప్పటికే సభాస్థలికి  వందలాది ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. మరోవైపు సభా నిర్వహకులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మైకులు, సౌండ్ బాక్సులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. 
 
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతామంటున్నారు విద్యార్థులు. రేపటి నుండి ఉద్యమాన్ని తామే నడుపుతామని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు ఉస్మానియా అండగా ఉందనీ, ఆర్టీసీ ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 
 
ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments