Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టులో దసరా పండుగ - ఒకే రోజు ఏడుగురు జడ్జీలు

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (17:46 IST)
తెలంగాణ హైకోర్టులో దసరా పండుగ వాతావరణం నెలకొంది. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం నియమించిన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేశారు. 
 
హైకోర్టు ఫస్ట్‌ కోర్టు హాలు వేదికగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కొత్త న్యాయ‌మూర్తుల చేత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ స‌తీశ్ చంద్ర‌శ‌ర్మ ప్ర‌మాణం చేయించారు. 
 
న్యాయ‌మూర్తులుగా ప్ర‌మాణం చేసిన వారిలో జ‌స్టిస్ పెరుగు శ్రీ సుధా, జ‌స్టిస్ డాక్ట‌ర్ చిల్ల‌కూరు సుమ‌ల‌త‌, జ‌స్టిస్ డాక్ట‌ర్ గురిజాల రాధారాణి, జ‌స్టిస్ మున్నూరి ల‌క్ష్మ‌ణ్‌, జ‌స్టిస్ ఎన్.తుకారాం జీ, జ‌స్టిస్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, జ‌స్టిస్ ప‌టోళ్ల మాధ‌వి దేవీ ఉన్నారు.
 
తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత తొలిసారి ఏడుగురు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్త న్యాయమూర్తులు ఈ నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు. 
 
విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో తేదీని శుక్రవారానికి మార్చారు. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments