ఖమ్మం జిల్లాలో 7 కోట్ల విలువ చేసే నకిలీ నోట్లు స్వాధీనం

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (17:50 IST)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి కేంద్రంగా సాగుతోన్న దొంగ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా నుంచి భారీగా నకిలీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఖమ్మం నగర పోలీస్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రూ.7 కోట్ల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. అమాయకులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు. ఈ ముఠాను నమ్మి చాలా మంది మోసపోయారని సీపీ చెప్పారు. 

ఈ ముఠా తెలంగాణ, ఏపీ, తమిళనాడులోనూ మోసాలకు పాల్పడిందని ఆయన వెల్లడించారు. ఈ ముఠాలో ఐదుగురిని అరెస్టు చేశామనీ.. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్టు తెలిపారు.

నిందితుల నుంచి నగదుతో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వెల్లడించారు. ఈ ముఠా కీలక సూత్రధారి పాత నేరస్థుడైన మదార్‌ మియాగా గుర్తించామని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే వాళ్లకు వల వేసి మోసం చేసేవారన్నారు.

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ.. అరెస్టు చేసిన వారిని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. నిందితులను పోలీస్‌ కస్టడీకి తీసుకొని ఇంకా ఎవరెవరిని మోసం చేశారు? ఎంత మేర మోసం చేశారో విచారించనున్నట్టు ఆయన వెల్లడించారు.

ఈ ముఠా చేతిలో మోసపోయినవారు ఎవరైనా తమ వద్దకు వస్తే న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని సీపీ విజ్ఞప్తి చేశారు. ఈ నకిలీ నోట్ల ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments