Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఐటీ మంత్రిని.. అంటే ఐ ఫర్ ఇవాంకా టీ ఫర్ ట్రంప్ : కేటీఆర్

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో భాగంగా, రెండోరోజైన బుధవారం ఈ సదస్సు సమన్వయకర్తగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (12:07 IST)
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017లో భాగంగా, రెండోరోజైన బుధవారం ఈ సదస్సు సమన్వయకర్తగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. ఈ ప్లీనరీలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్‌లు ఉన్నారు. 
 
ఇందులో మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్‌ను మంత్రి కేటీఆర్ వేదిక మీదకు ఆహ్వానించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా మంత్రి ఆహ్వానించారు. అయితే ఇవాంకాను పరిచయం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు. 
 
తాను రాష్ట్రానికి ఐటీ మంత్రిని అని, కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఐటీ నామస్మరణ జరుగుతున్నదని, ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని మంత్రి కేటీఆర్ నవ్వులు పూయించారు. మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాన్ని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ప్లీనరీని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. 
 
అంతకుముందు రెండోరోజు సమావేశాల్లో పాల్గొనేందుకు ఇవాంకా ట్రంప్ నిర్ణీత సమయానికి ట్రైడెంట్ హోటల్ నుంచి హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. ఈ సదస్సులో ప్యానలిస్టులతో పాటు టాలీవుడ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments