Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీసరలో రేవ్ పార్టీ.. 16మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (15:02 IST)
మేడ్చల్ జిల్లా కీసరలో రేవ్ పార్టీ కలకలం రేపింది. స్థానికంగా ఉండే ఓ ఫెర్టిలైజర్ వ్యాపారి ఫామ్ హౌస్‌లో పలువురు వ్యక్తులు అమ్మాయిలతో చిందులేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌస్కు చేరుకుని పార్టీలో పాల్గొన్న బేస్ర్ క్రాప్ సీడ్స్ కంపెనీ మేనేజర్‌ను, పది మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు, సిద్దిపేట, వరంగల్, నల్గొండ, గజ్వేల్‌కు చెందిన సీడ్స్ డీలర్లను అరెస్టు చేశారు. 
 
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆదివారం రాత్రి ఫారెస్ట్ రీడ్జ్ రిసార్ట్స్‌లోని ఓ విల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న 16 మందిని అరెస్ట్ చేసినట్లు కీసర పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారి నుంచి మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments