మూడేళ్ల చిన్నారి బాడీలోంచి 11 సూదులు..కావాలనే గుచ్చారా?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (07:54 IST)
మూడేళ్ల చిన్నారి బాడీలోంచి 11 సూదులు బయటపడ్డాయి. అవి శరీరంలోకి ఎలా వెళ్లాయి? ఎవరైనా జొప్పించారా? అనేది తెలియలేదు.

వనపర్తి జిల్లా వీపనగండ్లకు చెందిన పెబ్బిటి అశోక్, అన్నపూర్ణలకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. కుమారుడు లోక్ నాథ్(3) ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు.

వారం కిందట తల్లిదండ్రులు ఆ చిన్నారికి స్నానం చేయిస్తుండగా ఒక సూది మజిల్ లోంచి బయటకు చొచ్చుకురావడంతో హాస్పిటల్​కు తరలించారు.

డాక్టర్లు స్కాన్ చేయగా, నడుము కింది భాగంలో 11 సూదులు ఉన్నట్లు తేలింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఎవరో కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. చిన్నారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించామని, కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

తర్వాతి కథనం
Show comments