Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (11:00 IST)
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ఉద్యోగాల జాతర ఆరంభంకానుంది. భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, టీఎస్ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఆయన తెలిపారు. వీటి భర్తీ తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందన్నారు. 
 
కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు. సంస్థలోని ఉద్యోగులు సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఖుష్రోషా ఖాన్, వెంకన్న, మునిశేఖర్, రాజశేఖర్, జాయింట్ డైరెక్టర్లు ఉషాదేవి, నర్మద, రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments