తెలంగాణ : టీజీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ రిలీజ్

వరుణ్
గురువారం, 13 జూన్ 2024 (10:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని విడుదల చేశారు. ఈ పరీక్ష కీతో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జూన్‌ 13 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ లింక్‌ను ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. లాగిన్‌ అయ్యాక కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే ఇచ్చిన టెక్స్ట్‌ బాక్స్‌లో ఇంగ్లిష్‌లో తెలపవచ్చని పేర్కొంది.
 
అలాగే, కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను (ఉదా: రచయిత పేరు/ఎడిషన్‌/పేజీ నంబర్‌/పబ్లిషర్స్‌ పేరు/వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ వంటివి) అప్‌లోడ్‌ చేయవచ్చని కమిషన్‌ సూచించింది. ఈమెయిల్స్‌, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు తెలపడం వంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. 
 
అలాగే, నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించబోమని పేర్కొంది. మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి జూన్‌ 9న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3.02 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
 
మరోవైపు రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు పోస్టుల భర్తీకి ప్రధాన పరీక్ష షెడ్యూలును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments