Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్‌ను కలవరపెడుతున్న కేసులు.. పీపీఏకు సంబంధించి నోటీసులు

kcrcm

సెల్వి

, మంగళవారం, 11 జూన్ 2024 (16:12 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం వంటి అంశాలు కేసీఆర్‌ను కలవరపెడుతున్నాయి. 
 
ఇప్పుడు ఆ జాబితాలోకి మరొక తలనొప్పి వచ్చి చేరింది. కేసీఆర్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)కు సంబంధించి నోటీసులు అందాయి. 
 
అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో చేసిన పీపీఏలతోపాటు కొత్తగూడెం, దామరచర్లలో థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 
 
పీపీఏలను విచారించిన తర్వాత, కమిషన్. ఛత్తీస్‌గఢ్‌తో చేసిన పీపీఏల్లో అవకతవకలను గుర్తించింది. దీంతో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే ఈ అవకతవకలపై పూర్తి వివరణ ఇచ్చేందుకు జులై 30 వరకు పొడిగించాలని కేసీఆర్ కోరారు. 
 
కేసీఆర్ తన హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రతిపాదించారు. ఇప్పటికే విద్యుత్ శాఖ మాజీ అధికారులు, తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.ప్రభాకరరావు, మాజీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సురేశ్‌ చందా తదితరులను కమిషన్‌ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేసీఆర్ స్పందన సంతృప్తికరంగా లేకుంటే, వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఆయనను పిలుస్తామని కూడా కమిషన్ పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెలవారీ పింఛన్ల పెంపుపై కసరత్తు.. జూన్ నెలలో రూ.7 వేలు!!