Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామోజీ రావు మరణం జాతికి తీరని లోటు: అసోచామ్ ఏపీ- తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ కె రవికుమార్ రెడ్డి

Ramoji Rao

ఐవీఆర్

, శనివారం, 8 జూన్ 2024 (17:39 IST)
మీడియా రంగంలో తిరుగులేని వ్యక్తి, తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా పోరాటంలో చురుకైన కార్యకర్త అయిన శ్రీ చెరుకూరి రామోజీ రావు ఆకస్మిక మరణం చాలా బాధాకరం అని అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్)  ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ కటారు రవికుమార్ రెడ్డి తెలిపారు. 
 
భారతీయ వ్యాపారవేత్త, మీడియా వ్యవస్థాపకుడు- చలనచిత్ర నిర్మాత, చెరుకూరి రామోజీ రావు ఓ మహోన్నత వ్యక్తి. రామోజీ గ్రూప్ అధినేతగా, ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర నిర్మాణ సంస్థ రామోజీ ఫిల్మ్ సిటీ, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవీ టీవీ నెట్‌వర్క్, ఉషా కిరణ్ మూవీస్‌ సంస్థలను కలిగి ఉండటంతో పాటు పద్మ విభూషణ్, జాతీయ చలనచిత్ర అవార్డులను కలిగి ఉన్నారు. అతని అంకితభావం, వృత్తి నైపుణ్యం, వినయాన్ని నేను అభినందిస్తున్నాను, ప్రత్రికలలో తప్పుడు సమాచారం లేకుండా చేయటంతో పాటుగా ప్రత్రికా స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా ఆయన పనిచేశారు.
 
‘తెలుగు వెలుగు’ చెరుకూరి రామోజీ రావు మరణం జాతికి తీరని లోటు. ఆయన అంకితభావం, ఆవిష్కరణ జర్నలిజం, మీడియా రంగాలపై చెరగని ముద్ర వేసింది. అసోచామ్‌ బృందం చెరుకూరి రామోజీ రావుకు నివాళులర్పిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహోద్యోగులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతికి, రామోజీరావుకు వున్న అనుబంధం సంగతేంటి?