ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 51 రైళ్లు రద్దు... ఎందుకో తెలాసా?

ఠాగూర్
ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (14:05 IST)
హైదరాబాద్ నగరంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులకు అంతరాయం కలుగనుంది. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ సరా మొత్తం 51 రైళ్లను రద్దు చేశారు. దీనికి కారణం రెండో దశ నిర్మాణ పనులను కారణంగా వీటిని రద్దు చేశారు. మౌలాలి - సనత్ నగర్ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ - కాగజ్ నగర్ రైలును కూడా రద్దు చేశారు. దీంతో ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు 51 రైళ్లను రద్దే చేసినట్టు చెప్పారు. 
 
ఈ రైళ్లను టైమ్ టేబుల్ ప్రకారం రద్దు చేసినట్టు తెలిపారు. వీటిలో ఈ నెల 9వ తేదీ వరకు మూడు ఎంఎంటీఎస్‌లు, 10వ తేదీ వరకు మరో రెండు, 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్టు పేర్కొన్నారు. వీటితో పాటు మౌలాలి - అమ్ముగూడ - సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ - గుంటూరు, రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్ వారీగా ఆపేస్తామని వివరించారు. 
 
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ ఈ యేడాది మార్చి చివరినాటికి సిద్ధమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా, సనత్ నగర్ - మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను బైపాస్ చేస్తూ కొన్ని రైళ్లను నడిపే అవకాశం కలుగుతుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments