Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

ఠాగూర్
సోమవారం, 7 జులై 2025 (13:30 IST)
ఎట్టకేలకు హైదరాబాద్ - బెంగుళూరు హైవేకు మోక్షం లభించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న ఈ రహదారి విస్తరణ సమస్యకు కేంద్రం పరిష్కారం చూపింది. హైదరాబాద్ - బెంగుళూరు మార్గంలో హైస్పీడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీని నిర్మాణానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపకల్పన బాధ్యతలను టెండర్ ద్వారా ఓ సంస్థకు అప్పగించింది. 
 
 
కాగా, డీపీఆర్ కోసం రూ.12.63 కోట్లు వెచ్చించనున్నట్టు ఎన్.హెచ్.ఏ.ఐ పేర్కొంది. మరోవైపు నాగపూర్ - హైదరాబాద్ వరకు కూడా మరో హైస్పీడ్ కారిడార్‌ను నిర్మించాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అవసరమయ్యే డీపీఆర్ రూపకల్పన బాధ్యతను కూడా ఓ సంస్థకు కట్టబెట్టింది. తాజాగా డీపీఆర్ రూపకల్పనకు అవసరమైన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. 
 
ఈ డీపీఆర్ కోసం రూ.14.99 కోట్లు వెచ్చించనున్నారు. ఈ రెండు మార్గాలను 'విజన్-2047' జాతీయ రహదారుల మాస్టర్ ప్లానులో కూడా చేర్చినట్టు ఎన్.హెచ్.ఏ.ఐ తెలిపింది. త్వరలోనే ఈ మార్గాలకు సంబంధించిన సర్వే పనులు మొదలు కానున్నాయి. జాతీయ రహదారుల విభాగంలో ఉన్న నార్త్ సౌత్ కారిడార్ (ఎన్.హెచ్-44)లో భాగంగా నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు నిర్మించబోయే జాతీయ రహదారినే బెంగళూరు వరకు కొనసాగించాలని నిర్ణయించింది. అందుకోసం ఈ రహదారిని రెండు సెక్షన్లుగా విభజించింది. 
 
నాగ్పూర్-హైదరాబాద్ వరకు ఒకటి, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు మరో సెక్షన్ చేపట్టనుంది. ఈ హైస్పీడ్ కారిడార్‌ను 6 లేన్లుగా నిర్మించనుండగా, భవిష్యత్తులో 8 లేన్లు, ట్రాఫిక్ రద్దీని బట్టి 12 లేన్లుగా విస్తరించే అవకాశం ఉంది. ఈ క్రమంలో 12 లేన్ల విస్తరణకు అవసరమైన స్థాయిలోనే భూసేకరణ చేయనున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. 
 
ఈ రోడ్డు తెలంగాణలో 195 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 260 కి.మీ. కర్ణాటకలో 106 కి.మీ మేర నిర్మాణం కానుంది. మొత్తం 1150 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే ఈ రహదారికి రూ.35 వేల కోట్లకు పైగా అవసరమవుతాయని అంచనా. నాగపూర్ - హైదరాబాద్ - బెంగుళూరు వరకు ప్రతిపాదించిన హైస్పీడ్ కారిడార్‌పై గంటకు 120 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో వాహనాలు ప్రయాణించేలా రోడ్డును నిర్మించనున్నట్టు తెలిసింది. ఆ మేరకే సర్వే నిర్వహించనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments