Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణు స్వామికి షాకిచ్చిన తెలంగాణ మహిళా కమిషన్!!

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (09:36 IST)
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి, సినీ నటులు, రాజకీయ నాయకుల జాతకాలు వెల్లడించడం ద్వారా గత కొన్నాళ్లుగా బాగా పాపులర్ అయ్యాడు. అయితే, ఆయన ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్లలపై కామెంట్స్ చేశారు. వీరిద్దరి జాతకాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన పెను వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
 
వేణు స్వామి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, వేణు స్వామి ఈ నెల 22వ తేదీన వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. 
 
ఇది మొదటిసారి కాకపోయినా, గతంలో కూడా వేణు స్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల కెరీర్, వివాహాలు, అలాగే, రాజకీయ ఫలితాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన జోస్యం తప్పడంతో అప్పట్లో కూడా ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ అయిన తర్వాత, చైతన్య - శోభిత వివాహ నిశ్చితార్థంపై వ్యాఖ్యలు చేయడం మరోసారి వివాదాస్పదం అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments