Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య రెండు కాళ్లను తాడుతో బైకుకు కట్టి ఈడ్చెకళ్లిన కసాయి భర్త!!

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (09:13 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో ఒక అమానీయ ఘటన జరిగింది. కసాయి భర్త ఒకరు కట్టుకున్న భర్త కాళ్ళను తాడుతో బైకుకు కట్టి నడి రోడ్డుపై ఈడ్చెకెళ్లాడు. ఇంతకీ ఆ మహిళ చేసిన తప్పేంటంటే.. పక్క ఊరిలో ఉన్న తన సోదరి వద్దకు వెళతాన్ని చెప్పడమే ఈ దారుణానికి కారణం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో నిందితుడిని అరెస్టు చేశారు. 
 
నాగౌర్‌లోని నహర్‌‍సింగ్ పూర్ గ్రామానికి చెందిన ప్రేమ్ రామ్ మేఘ్‌వాల్ (32) అనే వ్యక్తికి భార్య సుమిత్ర ఉండగా, జైసల్మేర్‌లోని తన సోదరి వద్దకు వెళ్లాలని భావించింది. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పగా, ఆయన నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ్ రామ్.. పీకల వరకు మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. 
 
మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో పట్టరాని కోపంతో భార్య కాళ్లను తాడుతో తన బైకుకు కట్టేసి ఈడ్చుకెళ్లాడు. దీనిని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దీనిపై స్పందించిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. అయితే, బాధితురాలు ఇప్పటివరకు భర్తపై ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments