భర్తకు నత్తి అని పుట్టింటికి వెళ్లింది.. అక్కడ ప్రియుడితో జంప్ అయ్యింది.. రెండేళ్ల బిడ్డను?

సెల్వి
శనివారం, 13 సెప్టెంబరు 2025 (13:49 IST)
వివాహేతర సంబంధానికి అడ్డుగా వుందని కన్నబిడ్డనే కడతేర్చింది ఓ తల్లి. ఈ ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లికి చెందిన బొట్టు మమతకు 5ఏళ్ల క్రితం రాయపోల్‌ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్‌తో పెళ్లయింది. 
 
భాస్కర్, మమత దంపతులకు చరణ్, తనుశ్రీ ఇద్దరు పిల్లలున్నారు. భాస్కర్‌కు నత్తి వుందనే కారణంతో మమత పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింట్లో ఉండగా మమతకు అదేగ్రామానికి చెందిన ఫయాజ్‌తో అక్రమసంబంధం ఏర్పడింది.  ఈ ఏడాది మార్చిలో ప్రియుడు ఫయాజ్‌తో కలిసి మమత వెళ్లిపోయింది. 
 
అయితే పెద్దల జోక్యంతో తిరిగి వచ్చిన మమత భాస్కర్‌తో కలిసి జీవించేందుకు ఒప్పుకుంది. జూన్‌ 7న మమత మరోసారి ఫయాజ్‌తో వెళ్లిపోయింది.-కొడుకు శ్రీచరణ్‌ను పుట్టింట్లో వదిలేసి కూతురు తనూశ్రీని తీసుకుని ప్రియుడితో మమత జంపయింది. అయితే పోలీసులకు మమతపై కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. 
 
విచారణలో కూతురు తనుశ్రీని తన వెంట తీసుకెళ్లిన మమత ఊరి చివర  గొంతు పిసికి, గొయ్యి తీసి పాతిపెట్టినట్లు తేలింది. తనుశ్రీని తామే చంపినట్లు విచారణలో ఆ ఇద్దరూ అంగీకరించారు. దీంతో పోలీసులు ప్రియుడితో పాటు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించి.. రూ.3 కోట్లు ఆఫర్ చేశారు : మల్లారెడ్డి

Avika Gor: మిలింద్ తో పెండ్లి సమయంలో అవికా గోర్ కన్నీళ్ళుపెట్టుకుంది

Vijay Deverakonda: అందుకే సత్యసాయి బాబా మహా సమాధిని విజయ్ దేవరకొండ సందర్శించారా

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments