తెలంగాణాలో కంప్యూటర్లుగా మారనున్న టీవీలు.. ఎలా సాధ్యం?

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (12:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని టీవీలు ఇకపై కంప్యూటర్లుగా మారనున్నాయి. ఇది ఎలా సాధ్యమన్నదే కదా మీ అభిప్రాయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలకు ఫైబర్‌నెట్‌ను అందిచనుంది. నెలకు కేవలం రూ.300కే 20 ఎంబీపీఎస్ వేగంతో ఈ ఇంటర్నెట్‌ను సరఫరా చేయనున్నారు. దీంతో గ్రామీణులు తమ టీవీలను కంప్యూటర్లుగా మార్చుకుని అత్యాధునిక సౌకర్యాలు పొందే వెసులుబాటు దక్కనుంది. ఈ పథకాన్ని ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 
 
ఫైబర్ నెట్ కనెక్షన్‌తో ఇంట్లోని టీవీ కంప్యూటర్ లా మారిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అందించే కనెక్షన్ ద్వారా 20 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ కనెక్షన్ ద్వారా వివిధ రకాల చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. టీవీని కంప్యూటర్ ఉపయోగించుకోవచ్చు కాబట్టి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 
 
గ్రామంలోని అన్ని కార్యాలయాలు, స్కూళ్లకు కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇస్తారు. ప్రతి గ్రామంలోని కూడళ్లు, ఇతర చోట్ల అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇచ్చి వాటిని పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానిస్తారు. రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల ఇళ్లకు ప్రభుత్వం దశల వారీగా ఫైబర్ నెట్ సౌకర్యం కల్పిస్తుంది. 
 
వైఫైలాంటి ఈ కనెక్షన్ తీసుకుంటే ఇంటర్నెట్ తోపాటు టెలిఫోన్, ఓటీటీల సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మొదటి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో అమలు చేస్తారు. తర్వాత దశల వారీగా మిగిలిన గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తిచేస్తారు. దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 'భారత్ నెట్' పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ.2,500 కోట్లు కేటాయించింది. ఆ నిధులతోనే ప్రభుత్వం ఫైబర్ నెట్‌ను ప్రారంభించబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments