Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్రహీంపట్టణంలో పరువు హత్య.. డిగ్రీ చదువుతున్న కుమార్తెను హత్య చేసిన తల్లి!!

ఠాగూర్
బుధవారం, 20 మార్చి 2024 (11:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం దండుమైలారంలో పరువు హత్య జరిగింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని కన్న తల్లి కొట్టి చంపేసింది. తమ కుమార్తె వేరే కులం యువకుడిని ప్రేమించడం ఏమాత్రం ఇష్టంలేని కన్నతల్లి ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దండుమైలారం గ్రామానికి చెందిన మోతె జంగమ్మ - ఐలయ్య దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కుమార్తె భార్గవి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. భార్గవికి మేనబావతో వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయించారు.
 
అయితే, భార్గవి అప్పటికే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉండగా, తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భార్గవి ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఆమె ప్రియుడు ఇంటికి వచ్చాడు. ఇదేసమయంలో ఇంటికి వచ్చిన యువతి తల్లి వారిని మందలించగా యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత భార్గవి ఇంట్లో విగతజీవిగా పడి ఉండగా, తల్లి స్పృహ తప్పి పడి ఉంది.
 
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇంట్లో ఫ్యాన్‌కు భార్గవి మృతదేహాన్ని వేలాడదీసి, ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు యత్నించినట్లు గుర్తించారు. యువతి సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 
 
పోస్టుమార్గంతో పాటు స్థానికులు, కుటుంబసభ్యులను విచారించి, తల్లి జంగమ్మే భార్గవితో గొడవపడి, గొంతు నులిపి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె స్పృహలో లేకపోవటంతో విచారణ అనంతరం, వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తెలిపారు. భార్గవి హత్యోదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పోలీసులు, తండ్రి ఐలయ్యను సైతం విచారించనున్నట్లు తెలిపారు.
 
కుమార్తె మృతిపై తండ్రి స్పందిస్తూ, "నేను ఉదయం పొలానికి వరి కోయడానికి వెళ్లాను. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాను. ఇంట్లోకి రాగానే పొలంలో పనులకు ఎందుకు రాలేదు అని నా కూతురుని అడిగాను. ఆగ్రహంతో నన్ను ఏమిచేస్తావు? చంపుతావా అంటూ మీదమీదకొచ్చింది. నేను ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగానే నా కాలర్ పట్టుకుని స్పహతప్పి కింద పడిపోయింది. వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు" అని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments