బ్లాక్‌బాక్స్ డీకోడ్ చేస్తేనే ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయి : ఎస్ఎన్ రెడ్డి

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (11:30 IST)
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్‌బాక్స్ డీకోడ్ చేస్తే తప్ప అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు చెప్పలేమని తెలంగాణ ఏవియేషన్ అకాడెమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి అన్నారు. ఈ విమాన ప్రమాదంపై ఆయన స్పందిస్తూ, 24-36 గంటల వ్యవధిలో కాక్‌పిట్, బ్లాక్‌‍బాక్స్‌లను డీకోడ్ చేయొచ్చని తెలిపారు. 
 
ప్రమాదాలకు ప్రధానంగా సాంకేతిక లోపాలు, అనుభవం లేని పైలెట్లు, వాతావరణం బాగోలేకపోవడం వంటివి కనిపిస్తుంటాయన్నారు. కానీ, బోయింగ్ 787 ఎయిర్‌లైనర్ అధునాతనమైనది. అనుభవం కలిగిన పైలెట్లు ఉన్నారు. వాతావరణం బాగానే ఉంది. కారణం ఏమై ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేమన్నారు. 
 
టేకాఫ్ అయిన వెంటనే ప్రమాదమంటే తనిఖీలు చేయలాద్ అంటున్నారు. విమానం టేకాఫ్ ముందు ఇంజనీర్లు ప్రతిదీ తనిఖీ చేసి సర్టిఫై చేశాకే పైలెట్లు ముందుకొస్తారు. వారూ అన్ని చూసుకునే టేకాఫ్ చేస్తారు. 
 
25 వేల కంటే ఎక్కువ గంటలు గగనతలంలో శిక్షణ ఇచ్చిన అనుభవం నాది. రెండు ఇంజిన్లు విఫలమయ్యే అవకాశం చాలా అరుదు. ఒకటి, రెండు పక్షులతో ఇబ్బంది ఉండదు. ఒకేసారి వేల సంఖ్యలో పక్షులు వస్తే  ఇంజిన్లలోకి వెళితే ఫెయిల్ అవుతాయి. ఇదీ కాదంటే ఇంధన కల్తీతోనే ఇంజిన్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. పైలెట్ నియంత్రణలో లేని విషయం ఏదో జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments