పెను విషాదం ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ...

ఠాగూర్
శుక్రవారం, 13 జూన్ 2025 (10:02 IST)
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం పెను విషాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృత్యువాతపడ్డారు. ఈ హృదయ విదాకర ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద స్థలాన్ని ఆయన శుక్రవారం సందర్శించి, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. 
 
కాగా, ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ సజీవంగా బయటపడ్డాడు. మిగిలిన 241 మంది ప్రయాణికులు అగ్నికోరల్లో చిక్కుకుని దహనమైపోయారు. ఈ మృతుల్లో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా ఉండటం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను దర్యాప్తు అధికారులు వెలుగులోకి తీసుకునిరానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments