Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ బావమరిదిని తొమ్మిది గంటలు ప్రశ్నించిన పోలీసులు

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (11:07 IST)
Raj pakala
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ బావమరిది, జన్వాడ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుడు నెం.1 అయిన రాజ్ పాకాలకి బీఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు అందాయి. నార్సింగి డివిజన్ ఏసీపీ రమణ గౌడ్ నేతృత్వంలో మోకిల, నార్సింగి పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ జరిపిన అనంతరం ఈ నోటీసులు జారీ చేశారు. విచారణలో ఎన్నారై విజయ్ మద్దూరి వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వచ్చాయి.
 
పోలీసులు ప్రధాన నిందితుడిని జన్వాడ ఫామ్‌హౌస్‌కి, విజయ్ మద్దూరి మొబైల్ ఫోన్‌కు సంబంధించి సోదాల కోసం తీసుకెళ్లారు. సుమారు గంట పాటు ఫామ్ హౌస్‌లో సోదాలు నిర్వహించారు. పార్టీలో డ్రగ్స్ వినియోగించి దొరికిపోయిన విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగింది. కాగా, దాడి సమయంలో కొకైన్‌కు పాజిటివ్‌గా తేలిన విజయ్ మద్దూరి ప్రస్తుతం పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. 
 
అయితే విచారణ అనంతరం మోకిల పోలీస్ స్టేషన్ నుంచి రాజ్ పాకాల బయటకు వచ్చారు. తాను పోలీసులకు పూర్తిగా సహకరించానని ఆయన మీడియాకు తెలిపారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ తాను సమాధానం చెప్పినట్లు వెల్లడించారు. జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగింది ఫ్యామిలీ పార్టీ అని, విజయ్ మద్దూరి పోలీసులకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని ఆయన మీడియాకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిసెంబర్‌లో నాగచైతన్య - శోభితల వివాహం.. ఎక్కడ జరుగుతుందంటే?

ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడిగా ప్రిన్స్ మహేష్ బాబు

జనరల్‌గా హీరోయిన్‌కి స్పేస్ ఉండదు - పర్సనల్‌గా నాకు రాకెట్ ఇష్టం: రుక్మిణి

50 ఏళ్ల 50 కేజీల తాజమహల్ బ్యూటీ 'ఐష్' బాలీవుడ్ హీరోతో పట్టుబడిందట

హనుమాన్‌గా రిషబ్ శెట్టి జై హనుమాన్ ఫస్ట్ లుక్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

ప్రియా.... నను క్షమించవా ఈ జన్మకి ఈ ఎడబాటుకి

తర్వాతి కథనం
Show comments