Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ స్ట్రోక్ డే 2024: తెలంగాణలో పెరుగుతున్న స్ట్రోక్ సంఘటనలు, అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్

World Stroke Day 2024

ఐవీఆర్

, సోమవారం, 28 అక్టోబరు 2024 (19:07 IST)
ప్రపంచ స్ట్రోక్ డే 2024న, తెలంగాణలో స్ట్రోక్ కేసుల ప్రాబల్యం పై ప్రధానంగా దృష్టి సారించింది. ఇది రక్తపోటు, మధుమేహం, ధూమపానం మరియు ప్రజలలో అవగాహన లేకపోవడం వంటి ప్రమాద కారకాలచే ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. ఈ సవరించదగిన ప్రమాద కారకాలపై తగినంత నియంత్రణ లేనందున, రాష్ట్రం గణనీయమైన ప్రజారోగ్య సవాలును ఎదుర్కొంటుంది. అధిక శాతం మంది వ్యక్తులు ప్రమాదంలో వున్నారు. ఈ సంవత్సరం స్ట్రోక్ డే యొక్క నేపథ్యం, "గ్రేటర్‌ దెన్ స్ట్రోక్ యాక్టివ్ ఛాలెంజ్", స్ట్రోక్ నివారణ, పునరావాసం(రీహాబిలిటేషన్ ) గురించి అవగాహన పెంచే క్రీడల యొక్క శక్తిని ఇది వెల్లడిస్తుంది, అన్ని వర్గాల ప్రజలను నిమగ్నం చేస్తుంది.
 
తెలంగాణలో, స్ట్రోక్ యొక్క ప్రాబల్యం కారణంగా గ్రామీణ, పట్టణ జీవనశైలి ప్రభావితమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారుగా 90% పెద్దలు కనీసం ఒక హృదయనాళ ప్రమాద కారకాన్ని కలిగి ఉన్నారు. స్ట్రోక్ ఒక ప్రధాన ప్రజారోగ్య ఆందోళనగా ఉంది, సంబంధిత ప్రమాద కారకాలను తగ్గించడానికి మెరుగైన నాడీ సంబంధిత సేవలు, ప్రజారోగ్య కార్యక్రమాలు అవసరం.
 
అవగాహనను మరింత పెంచడానికి, సమాజంతో అనుబంధించబడటానికి, వరల్డ్ స్ట్రోక్ డే పురస్కరించుకుని వాక్‌థాన్, బైక్ ర్యాలీని హెచ్‌సిఏహెచ్ నిర్వహించింది. స్ట్రోక్‌ల ప్రభావం, సకాలంలో పునరుధ్దరణ యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యత గురించి ప్రజల అవగాహన పెంచడంలో ఈ సంఘటనలు కీలకమైనవి. వాక్‌థాన్‌లో సుమారుగా 70మందికి పైగా పాల్గొన్నారు. సోమాజిగుడా నుండి గచ్చిబౌలి వరకు 50 మందికి పైగా బైక్‌ ర్యాలీలో చేరారు. తద్వారా సమగ్ర స్ట్రోక్ సంరక్షణ, నివారణ వ్యూహాల యొక్క అత్యవసర అవసరాన్ని ఎత్తిచూపడానికి కమ్యూనిటీ సభ్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, స్ట్రోక్ బారిన పడి కోలుకున్న వారిని ఒకచోట చేర్చారు.
 
హెచ్‌సిఏహెచ్ ఎస్ఆర్ సిసి  మరియు హెచ్‌సిఏహెచ్ జిబి ఆర్ఆర్ సి , హైదరాబాద్ మరియు చుట్టుపక్కల  200+ పడకలలో సంపూర్ణ, వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందిస్తున్నాయి. వారి విధానం పక్షవాతంను తిప్పికొట్టడం, కండరాల పనితీరును పునరుద్ధరించడం మరియు మానసిక ఆరోగ్యానికి తోడ్పడటం, ప్రపంచ స్థాయి పరికరాలు మరియు ప్రత్యేకమైన "మెడిసిన్ రూల్ స్టోన్" పద్దతిని ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది.
 
హెచ్‌సిఏహెచ్ యొక్క సీఈఓ వివేక్ శ్రీవాస్తవ్  మాట్లాడుతూ  "హెచ్‌సిఏహెచ్ వద్ద మా లక్ష్యం,  రోగులకు సౌకర్యవంతమైన వాతావరణంలో ప్రొఫెషనల్ కేర్ ను  అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను సమూలంగా మార్చడం. స్ట్రోక్ బారిన పడిన వారి యొక్క సంక్లిష్ట అవసరాలను మేము అర్థం చేసుకున్నాము  వ్యక్తిగతీకరించిన పునరావాస ప్రణాళికలను అభివృద్ధి చేసాము. అవి వారి శారీరక విధులను పునరుద్ధరించడమే కాకుండా  భావోద్వేగ శ్రేయస్సును కూడా మెరుగుపరుస్తాయి" అని అన్నారు.
 
హెచ్‌సిఏహెచ్ యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు సిఓఓ  డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ " మల్టీడిసిప్లినరీ నైపుణ్యం మరియు అధునాతన పునరావాస పరికరాల కలయిక ద్వారా, మేము పక్షవాతం బారిన పడిన రోగులకు రికవరీ సమయాన్ని గణనీయంగా తగ్గించగలుగుతున్నాము. రోగులు మరియు వారి కుటుంబాలతో ఒప్పందం చేసుకుని వ్యక్తిగతీకరించిన సంరక్షణ ప్రణాళికలను సృష్టించడం ద్వారా,  ప్రతి స్ట్రోక్ సర్వైవర్ వారి అవసరాలకు అనుగుణంగా సంరక్షణను పొందుతున్నారని మేము నిర్ధారిస్తున్నాము. మా సమగ్రమైన విధానం లో భాగమైన కాగ్నిటివ్ థెరపీ, సెన్సరీ  రిహాబ్ . రిక్రియేషన్ రిహాబ్ మరియు మరెన్నో రోగులు సాధారణ జీవితానికి తిరిగి రావటానికి తోడ్పడుతుంది మరియు మరోమారు స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది" అని అన్నారు. 
 
డాక్టర్ మానస్ కుమార్ పానిగ్రహి, హెచ్ఓడి & సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జరీ, కిమ్స్ హాస్పిటల్‌ వారు మాట్లాడుతూ, "రోగులు మరియు వారి కుటుంబాలతో ఒప్పందం చేసుకుని వ్యక్తిగతీకరించిన సంరక్షణ ప్రణాళికలను సృష్టించడం ప్రతి స్ట్రోక్ సర్వైవర్, వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా చికిత్స పొందగలరని నిర్ధారిస్తుంది. మా సమగ్ర విధానంలో అభిజ్ఞా చికిత్సను ఇంద్రియ పునరుద్దరణ, రిక్రియేషనల్ థెరఫీ, మరెన్నో ఉంటాయి. ఈ  చికిత్సలు శారీరక పునరుద్ధరణకు మాత్రమే కాకుండా, భావోద్వేగ శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కూడా కీలకమైనవి, వ్యక్తులు సాధారణ జీవితానికి తిరిగి రావడానికి, మరోమారు స్ట్రోక్ రాకుండా నివారించడంలో సహాయపడతాయి" అని అన్నారు. 
 
పునరుద్ధరణ యొక్క "గోల్డెన్ పీరియడ్" ప్రాముఖ్యతను నిపుణులు నొక్కిచెప్పారు. స్ట్రోక్ వచ్చిన వెంటనే స్పందించే క్లిష్టమైన సమయం ఇది. ఈ స్పందనతో శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చు. మెరుగైన నిఘా వ్యవస్థలు, సమాజ-ఆధారిత జోక్యం, స్ట్రోక్ ఎపిడెమియాలజీపై నిరంతర పరిశోధనలు వంటివి విపరీతంగా పెరుగుతున్న ఆరోగ్య భారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ విధానాలు తీసుకురావటానికి, వనరుల కేటాయింపులను జేయడానికి అవసరం.
 
వరల్డ్ స్ట్రోక్ దినోత్సవ వేళ, స్ట్రోక్ నివారణ మరియు పునరావాసం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచాలని  విధాన రూపకర్తలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు మరియు ప్రజలను హెచ్‌సిఏహెచ్  కోరింది. కలిసికట్టుగా, అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును మనం సృష్టించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?