Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుకు అడ్డుగా వచ్చి కోతి.. కారు-ఆటో ఢీ.. ఒకరు మృతి.. పది మందికి?

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (19:52 IST)
కోతి రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దాని నుంచి తప్పించుకుందామని కారు అదుపు తప్పింది. కారు అటూ ఇటూ తిరుగుతూ ఆటోను ఢీకొట్టింది. అంతే అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. వేములవాడ అర్బన్ మండలం పోశెట్టిపల్లి గ్రామంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చింతలఠాణ గ్రామానికి చెందిన 11 మంది కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి వెళ్లారు.

అందరూ పని ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరారు. వస్తుండగా పోశెట్టిపల్లి వద్ద ఆటోను కోతి ఢీకొట్టడంతో కోతిని తప్పించుకునే ప్రయత్నంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళా కార్మికురాలు మృతి చెందగా, 10 మందికి తీవ్రగాయాలు కాగా వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కోతి వల్లే ప్రమాదం జరిగిందని ఆటో డ్రైవర్ చెబుతున్నాడు. అయితే.. ఈ ప్రాంతంలో కోతుల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను కోతులు ఒక్కసారిగా అడ్డుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. కోతులు రోడ్డుపైకి రాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Ravi Mohan: రవికి చెక్ పెట్టిన భార్య ఆర్తి.. భరణం కింద రూ.40లక్షలు ఇవ్వాల్సిందే

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments