Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

వరుణ్
గురువారం, 4 జులై 2024 (13:17 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని, వారిద్దరూ సహచరులేనని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని చెప్పారు.  చంద్రబాబు ఏపీ సీఎంగా, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. వారిద్దరి మధ్య గురుశిష్యుల సంబంధం ఉందని చెప్పేవారివి అవగాహన లేని మాటలు అన్నారు.
 
తమ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇచ్చిన గడువు కంటే ముందుగానే అమలు చేశామని తెలిపారు. త్వరలో రైతు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఐదేళ్లు అయినా హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమను అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
 
రైతుబంధును తాము రైతుభరోసాగా మార్చినట్లు చెప్పారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీలో తమ సొంత నిర్ణయాలు ఉండవని స్పష్టంచేశారు. ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కట్టిన ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచాలనేదే తమ ఆలోచన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మల్లిక్ తేజ్‌పై కేసు.. నాపై ఎన్నోసార్లు అత్యాచారం చేశాడు..

సమంతకు వుమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ అవార్డు.. తగ్గేదేలే..!

ప్రకాశ్ రాజ్‌ను అంకుల్ అని పిలుస్తా.. ఆయనంటే గౌరవం వుంది.. విష్ణు

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments