Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నార తీస్తున్న నాదెండ్ల మనోహర్, పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్ (video)

Nadendla Manohar- Pawan Kalyan

ఐవీఆర్

, బుధవారం, 3 జులై 2024 (15:26 IST)
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మంత్రులు చురుకుగా పనిచేస్తున్నారు. ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు సమస్యల పరిష్కారానికై యుద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రిమండలి రాష్ట్రవ్యాప్తంగా వున్న సమస్యలపై దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశగా వేగంగా కదులుతున్నారు. ప్రతి నెలా జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని ఉద్యోగులకు మొదటి తేదీకే జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో వేసి శభాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వుండాలని నేను చెప్పానంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.
 
పంచాయతీరాజ్ ప్రక్షాళన ఒకవైపు... ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం పవన్
డిప్యూటీ ముఖ్యమంత్రిగా వున్న పవన్ కళ్యాణ్ కీలక శాఖలు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అందులో ముఖ్యమైన పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయడమే కాకుండా దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతానని ప్రతిజ్ఞ చేసారు. ఇందులో భాగంగా పంచాయతీలకు కేటాయించాల్సిన నిధులపై దృష్టి కేంద్రీకరించారు. గత పాలకులు పంచాయతీ నిధులను పక్కదారి పట్టించినట్లు అధికారుల ద్వారా తెలుసుకున్న పవన్... అభివృద్ధికి పట్టుగొమ్మలైన గ్రామాలను నిర్లక్ష్యం చేసారని మండిపడ్డారు. రూ. 500 కోట్లతో రుషికొండపై భవనాలు కట్టారు కానీ ఆ వ్యయంతో రాష్ట్రంలోని ఓ జిల్లా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది వుండేదన్నారు. నిధులు వున్నాయనీ, ఐతే ఆ నిధులను గత ప్రభుత్వం రాజకీయ నాయకుల అనుచరులకు దోచి పెట్టేశాయని విమర్శించారు. ప్రజాధనాన్ని లూటి చేసినవారిని ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
 
ప్రజావాణి సమస్యలపై ఫోకస్
తమ సమస్యల పరిష్కారానికై ప్రజలు పెద్దఎత్తున జనసేన ప్రజావాణికి తరలివస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రజావేదికలో బాధితురాలు తమ కుమార్తె మిస్సింగ్ కేసును 9 నెలల క్రిందట నమోదు చేసాననీ, తన కుమార్తె జాడ తెలిలేదని డిప్యూటీ సీఎం పవన్ వద్ద చెబుతూ విలపించారు. వెంటనే పోలీసు స్టేషనుకి ఫోన్ చేసిన డిప్యూటీ సీఎం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేవలం 9 రోజుల్లో యువతి ఆచూకిని పోలీసులు గుర్తించారు. ఇలా సమస్యలను పరిష్కరించడమే కాకుండా శాఖాపరంగా జరిగిన అవినీతిని తోడే ప్రయత్నం చేస్తున్నారు.
 
నార తీస్తున్న నాదెండ్ల మనోహర్
పౌర సరఫరాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ విశ్రమించడంలేదు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య పనులుపై ఫోకస్ పెట్టారు. రోడ్డుకిరువైపులా ఏళ్లుగా పేరుకుపోయి వున్న చెత్తను యుద్ధప్రాతిపదికన తొలగించి శుభ్రం చేయాలని ఆదేశించడమే కాదు స్వయంగా తనే దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షించారు. మరోవైపు కాకినాడలో వైసిపి నాయకులు భారీగా అవినీతికి పాల్పడ్డారనీ, రైతుల వద్ద అత్యంత తక్కువ ధరకే బియ్యాన్ని కొని కోట్ల రూపాయల లాభాలకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేల క్వింటాళ్లతో వున్న గోదాములను సీజ్ చేసారు. ఈ అవినీతి వెనుక ఎవరు వున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
 
మరోవైపు... ప్రజలు మనకు ఇచ్చిన ఈ బాధ్యతను గుర్తెరిగి అనునిత్యం వారికి సేవకులుగా పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన మంత్రులకు పిలుపునిచ్చారు. ప్రజలు మనకిచ్చిన ఐదేళ్ల కాలంలో ప్రతి గంట కూడా ఎంతో ముఖ్యమైనదనీ, సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నాయకులకు సూచన చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగారెడ్డిలో బాలుడిపై వీధి కుక్కల స్వైర విహారం.. (Video)