Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూరిస్ట్ బస్సులో మంటలు - నిజామాబాద్ వాసి సజీవదహనం

ఠాగూర్
బుధవారం, 15 జనవరి 2025 (09:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ టూరిస్టు బస్సుల చెలరేగిన మంటల్లో చిక్కుకుని నిజామాబాద్ వాసి సజీవదహనమయ్యారు. ఆదిలాబాద్ నుంచి 50 మంది పర్యాకులతో వెళుతున్న బస్సుకు యూపీలోని బృందావన్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సు మొత్తం కాలిబూడిదైపోయింది. ఈ మంటల నుంచి 49 మంది ప్రాణాలు కోల్పోగా, ఓ వ్యక్తి మాత్రం సజీవదహనమయ్యారు. 
 
ఆదిలాబాద్ నుంచి 50 మంది పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో బస్సు కాలిబూడిదైంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మిగతా 49 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మృతుడిని నిజామాబాద్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సీకి చెందిన శీలం ధృవత్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
ఈ సమాచారం తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వెంటనే స్పందించారు. అక్కడి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి బాధితులను క్షేమంగా తిరిగి రప్పించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన యాత్రికులు ప్రస్తుతం పోలీసులు, ఆర్ఎస్ఎస్ సంరక్షణలో ఉన్నారు. స్వస్థలాలకు వెళ్లేందుకు వారికి ఆర్థిక సాయం కూడా చేసినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో రొమాంటిక్ హారర్ జానర్ గా రాజా సాబ్

లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దిల్ రూబా

విక్రాంత్, చాందినీ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ నేపథ్యంలో సంతాన ప్రాప్తిరస్తు

Daku Maharaj: డాకు మహారాజ్‌ సినిమా చూసిన పురంధేశ్వరి ఫ్యామిలీ (video)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments