Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు లోగిళ్ళలో భోగి మంటలు.. మొదలైన సంక్రాంతి సంబరాలు

Advertiesment
bhogi festival

ఠాగూర్

, సోమవారం, 13 జనవరి 2025 (10:48 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా భోగి పండుగను పురస్కరించుకుని సోమవారం వేకువజామునే ప్రజలు తమ ఇళ్లముందు భోగి మంటలు వేశారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకుంటూ ఒకరినొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భోగి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ప్రజలు సందడి చేశారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా యువతీ యువకలు, పిల్లలు, పెద్దలు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకున్నారు. మహిళలు అందంగా రంగ వల్లులను తీర్చిదిద్దారు. హరిదాసులతో అలంకరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్తున్నాయి. 
 
వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విశాఖ ఆర్కే బీచ్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు పాల్గొన్నారు. సంక్రాంతి కోసం నగర వాసులు తమ తమ స్వగ్రామాలకు తరలిరావడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు, ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దీంతో ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 
 
భోగి పండుగను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ పండగ అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవింతలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. 
 
భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరిపోయి మీకు భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆశలు, ఆశయాలూ తీర్చడానికి ప్రజాప్రతినిధులుగా మేం అన్ని వేళలా మీతోనే ఉంటామని ఈ సందర్భంగా హమీ ఇస్తున్నాను. మీ అందరికీ మరోసారి పండగ శుభాకాంక్షలు అని చంద్రబాబు తన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Maha Kumbh 2025:ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా... 45 రోజులు... అన్నీ ఏర్పాట్లు సిద్ధం