Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

Advertiesment
kolikapudi srinivasa rao

ఠాగూర్

, ఆదివారం, 12 జనవరి 2025 (18:09 IST)
టీడీపీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు తలనొప్పిగా మారారు. ఆయన పనులు, చేష్టలు మరోమారు వివాదానికి దారితీసింది. ఆయన చర్యల వల్ల ఓ దంపతులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ రహదారికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెళ్లిన నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి మరీ కొట్టి, అవమానకరంగా తిట్టారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన వైకాపా వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగుమందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను తొలుత తిరువూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని హెల్ప్ అసుపత్రికి తరలించారు.
 
స్థానికుల సమాచారం మేరకు.. పల్లెపండగలో భాగంగా గోపాలపురం గ్రామంలో ఇటీవల సిమెంట్ రహదారిని వేశారు. ఈ రహదారి విషయంలో వైకాపా వార్డు సభ్యురాలు భూక్యా చంటి భర్త కృష్ణా, భూక్యా రాంబాబు అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరుగుతోంది. భూక్యా రాంబాబు టీడీపీ గ్రామ కార్యదర్శిగా ఉన్నారు. కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డుకు అడ్డంగా కంపలు వేసి ఎవరూ రాకపోకలు సాగించడానికి వీళ్లేదని భూక్యా చంటి, ఆమె భర్త కృష్ణా, కుమారులు గోపి, రాజు అడ్డుకున్నారు. వివాదం పరిష్కరించాకే రహదారిపై రాకపోకలు సాగించాలని తేల్చి చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో రాంబాబు ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం వచ్చారు. ఆయన దృష్టికి రహదారి విషయాన్ని రాంబాబు, టీడీపీ నేతలు తీసుకెళ్లారు. కొత్తగా వేసిన రోడ్డుపై కంపలు వేసి అడ్డుకుంటున్నారని చెప్పడంతో... నేతలతో కలిసి ఆయన సంఘటనా స్థలానికి వెళ్లారు. రాంబాబు తరపున ఎమ్మెల్యే వచ్చి.. భూక్యా కృష్ణా, చంటి కుటుంబాన్ని నిలదీయడంతో వివాదం పెద్దదైంది. కొంత సేపటికి గొడవ సద్దుమణగడంతో రహదారిపై ఎలాంటి కంపలు వేయొద్దని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
ఎమ్మెల్యే వెళ్లిన కొంతసేపటి తర్వాత భూక్యా చంటి... పురుగుమందు డబ్బా పట్టుకుని వచ్చి తాగేశానని చెప్పింది. దీంతో 108 వాహనంలో ఆమెకు తొలుత ప్రాథమిక చికిత్సను అందించి.. అనంతరం తిరువూరు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడలోని హెల్ప్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. మహిళకు ప్రాణాపాయం లేదు. మరో 48 గంటలు పర్యవేక్షణలో ఉంచనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా